న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ప్రయాణించాల్సిన సుమారు వందకుపైగా ప్రయాణికులు(Air India Passengers).. థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్‌లో చిక్కుకున్నారు. సుమారు మూడు రోజుల నుంచి ఆ ప్రయాణికులు అక్కడే ఉంటున్నారు. సాంకేతిక లోపం వల్ల ఎయిరిండియా విమానం దాదాపు 80 గంటలుగా అక్కడే నిలిచిపోయింది. నవంబర్ 16వ తేదీన ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానం.. ఆరు గంటలకు ఆలస్యంగా వెళ్లనున్నట్లు తొలుత ప్రకటించారు. ఎయిర్‌పోర్టులో చాలా సమయం ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఆ తర్వాత ప్లేన్ దిగిపోవాలని ప్రయాణికుల్ని కోరారు. ఆ తర్వాత ఫ్లయిట్‌ను రద్దు చేశారు.
సాంకేతిక లోపం తలెత్తిన విమానంలోనే తీసుకెళ్లనున్నట్లు తొలుత చెప్పారు. కానీ ఆ ప్లేన్‌లో ఉన్న సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారు. ప్లేన్ టేకాఫ్ తీసుకున్న తర్వాత రెండున్నర గంటల్లోనే పుకెట్‌లో ల్యాండ్ చేశారు. సాంకేతిక లోపం వల్ల విమానాన్ని దించినట్లు చెప్పారు. అప్పటి నుంచి ప్రయాణికులు పుకెట్ లోనే ఎదురుచూస్తున్నారు. 16వ తేదీన డ్యూటీ టైం దాటడంతో విమానాన్ని నడపలేకపోయినట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. అయితే 17వ తేదీన విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
ప్రయాణికులకు బస ఏర్పాటు చేసినట్లు ఎయిరిండియా అధికారి వెల్లడించారు. ప్రయాణికులకు రీఎంబర్స్మెంట్ చేశామని, అనేక మంది ప్రయాణికులు ఇంకా చిక్కుకున్నారని, పుకెట్‌లో ఉన్న ప్రయాణికుల్ని వెనక్కి తీసుకువస్తామని ఓ అధికారి చెప్పారు.