ఖాట్మండు: నేపాల్లో మళ్లీ రాజరికం అమలు చేయాలని ఆ దేశ మాజీ రాజు జ్ఞానేంద్ర షా మద్దతుదారులు శుక్రవారం రాజధాని కాఠ్మాండూలో విధ్వంసానికి పాల్పడ్డారు. అయితే భద్రతా దళాలు ఆందోళనకారులను సమర్థంగా అడ్డుకోవడంతో శుక్రవారం విధించిన కర్ఫ్యూను శనివారం తొలగించారు.
శుక్రవారం టిన్కునేలోని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై రాళ్లతో దాడి చేసిన నిరసనకారులు వాహనాలకు నిప్పు పెట్టడంతోపాటు దుకాణాలలో లూటీలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో ఒక టీవీ కెమెరామెన్తో సహా ఇద్దరు వ్యక్తులు మరణించగా పోలీసులు, ఆందోళనకారులు కలిపి 110 మందికిపైగా గాయపడ్డారు.