న్యూఢిల్లీ, ఆగస్టు 2: భారత్‌లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు గణనీయంగా పెరిగినప్పటికీ అవయవ దానం చేసే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రతి 10 లక్షల మంది భారతీయులలో ఒకరికన్నా తక్కువ మంది అవయవ దానానికి ముందుకు వస్తున్నట్లు శనివారం ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.
2024 జనవరి నుంచి డిసెంబర్ మధ్య 18,911 అవయవ మార్పిడులు జరినట్లు నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్(నాట్టో)కు సమాచారం అందింది. మొత్తం అవయవ మార్పిడులకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో, సజీవ అవయవ దాన మార్పిడిలో మొదటి స్థానంలో ఉన్నట్లు నాట్టో శనివారం నాడిక్కడ విడుద లచేసిన 2024-25 వార్షిక నివేదిక వెల్లడించింది.