న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్త్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. అధికారిక గెజిట్లో ప్రచురించిన నోటిఫికేషన్ ప్రకారం సుప్రీంకోర్టు (జడ్జిల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్-2026పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సంతకం చేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టం, 1956లోని సెక్షన్ 2లో ‘ముప్పై మూడు’ అనే పదానికి బదులుగా ‘ముప్పై ఏడు’ అనే పదాన్ని పొందుపరుస్తారు. సీజేఐని మినహాయించి ఈ సంఖ్య వర్తిస్తుంది.