Heavy Rains | న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక గత మూడు రోజులుగా ఢిల్లీ, హర్యానాల్లో కురుస్తున్న భారీ వానలకు వరద పోటెత్తడంతో యమునా (Yamuna) నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. నగరంలోని పాత రైల్వే వంతెన (Old Railway Bridge) వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు నదిలో నీటిమట్టం 206.65 మీటర్లకు పెరిగింది. నది ప్రమాదకర స్థాయిని దాటి (Danger mark) ప్రవహిస్తుండటంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీచేశారు. హర్యానా హత్నికుండ్ బ్యారేజీ నుంచి యమునా నదిలోకి ఎక్కువ నీటిని విడుదల చేయడంతో గంటగంటకు నీటిమట్టం పెరుగుతున్నది.
Delhi
ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని మయూర్ విహార్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో (Mayur Vihar Extension) నది ఒడ్డున నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. హర్యానాలో (Haryana) కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం హత్నికుండ్ బ్యారేజీ (Hathnikund barrage) గేట్లను ఎత్తివేసింది. తద్వారా 1,05,453 క్యూసెక్కుల నీరు యమునా నదిలో కలుస్తున్నది.
Delhi 2