న్యూఢిల్లీ : అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకటైన ఒరాకిల్ భారత్‌లో పెద్దయెత్తున ఉద్యోగులను తొలగించనుంది. సుమారు 10 శాతం మంది సిబ్బందిని ఇంటికి పంపనున్నట్టు ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఓపెస్ ఏఐతో అతి పెద్ద ఒప్పందం కుదుర్చుకోవడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న తర్వాత కంపెనీ తీసుకున్న ఈ ఆకస్మిక చర్యపై పెద్దయెత్తున ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఒరాకిల్ భారత్‌లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్‌కతాలలో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. గత ఏడాదికి 28,424 మంది ఉద్యోగులు వీటిలో పనిచేస్తున్నారు.