విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా
న్యూఢిల్లీ : విపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేశాయి. మార్గరెట్ అల్వాను తమ అభ్యర్థిగా బరిలో నిలిపాయి. మార్గరెట్ పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. గతంలో ఆమె నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా సేవలందించారు. ఆమె కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు. ఆమె స్వస్థలం కర్నాటక. 1942 ఏప్రిల్ 14న కర్నాటక మంగళూరులో జన్మించారు. 1969లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె 1975, 1977 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా 1978 , 1980 మధ్య కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
ఏప్రిల్ 1974లో మార్గరెట్ అల్వా కాంగ్రెస్ ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1980, 1986, 1992లో తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఉన్న సమయంలో పలు స్టాండింగ్ కమిటీల్లో సేవలందించారు. 1984-85 మధ్య పలుశాఖలకు మంత్రిగాను సేవలందించారు. 1999లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. ఆ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇదిలా ఉండగా.. శనివారం అధికార ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిగా జగ్దీప్ ధన్‌ఖఢ్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

