న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించడాన్ని నిరసిస్తూ.. ఇవాళ విపక్ష పార్టీల(Opposition MPs)కు చెందిన ఎంపీలు నల్ల దుస్తులు(black dress) ధరించి నిరసన(protests) ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్ ఉభయసభల్లోనూ విపక్ష ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించారు. లోక్‌సభలో కొందరు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా చైర్‌ను ముట్టడించారు. స్పీకర్ చైర్‌పై పేపర్లు చించి విసిరేశారు. ప్లకార్డుల(placards)ను కూడా విసిరేశారు. అయితే ఆందోళనల మధ్యలోనే స్పీకర్ బిర్లా(speaker birla) సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభను 2 గంటల వరకు వాయిదా వేశారు.
#WATCH | Delhi: Opposition MPs protest near Gandhi statue in Parliament, wearing black attire, over Adani Group issue.
Congress president-Rajya Sabha LoP Mallikarjun Kharge and UPA chairperson Sonia Gandhi also join the protest. pic.twitter.com/JSYM8luVQt
— ANI (@ANI) March 27, 2023
పార్లమెంట్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఇవాళ విపక్ష నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అదానీ అంశం(adani issue)పై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని(loksabha membership) రద్దు అంశాన్ని కూడా ప్రస్తావించారు. రాహుల్ ఇష్యూకు నిరసనగా కూడా ప్రదర్శన చేపట్టారు.
ఇవాళ ఉదయం ఖర్గే ఆఫీసులో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఆ భేటీకి సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. రాహుల్ అనర్హత వేటు అంశాన్ని వాళ్లు డిస్కస్ చేశారు. నల్ల దుస్తుల్లో ఎంపీలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. విపక్ష ఎంపీల భేటీకి నల్ల దుస్తుల్లో తృణమూల్ ఎంపీ(Trinamool mps)లు కూడా హాజరయ్యారు.