న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అఖిల భారత సామాజిక న్యాయ ఫోరం ఆధ్వర్యంలో సామాజిక న్యాయం: భవిష్యత్తు మార్గం అంశంపై ఢిల్లీలో సోమవారం సదస్సు జరగనుంది. దీనికి తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సహా దాదాపు 20 విపక్షాలు పాల్గొంటాయని భావిస్తున్నారు. రాజస్థాన్, జార్ఖండ్ సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సదస్సు ఆన్లైన్లో కూడా జరిగే అవకాశం ఉంది. ఇది రాజకీయేతర వేదికని, ఉమ్మడి లక్ష్యం కోసం అందరూ కృషి చేస్తున్నామని డీఎంకే వర్గాలు తెలిపాయి.