భువనేశ్వర్ : ఒడిశాలోని స్వాభిమాన్ అంచల్ ఏరియాలో బీఎస్ఎఫ్కు చెందిన ప్రత్యేక బలగాలు నిన్న కూంబింగ్ చేపట్టాయి. రోడ్డు పక్కన అమర్చిన 3 ఐఈడీలను గుర్తించి, నిర్వీర్యం చేశారు. వీటిని టిఫిన్ బాక్సుల్లో అమర్చినట్లు బలగాలు నిర్ధారించాయి. ఇక ఆ ఏరియాలోనే భారీగా మందు గుండు సామాగ్రితో పాటు జనరేటర్‌ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆంధ్రా – ఒడిశా సరిహద్దుకు చెందిన మావోయిస్టులే పేలుళ్లకు ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Odisha | Special Operations team of Border Security Force (BSF) has recovered 3 IEDs adjacent to a road near Tentulipadar in Swabhimaan Anchal yesterday: BSF pic.twitter.com/Zs2naJIr7s
— ANI (@ANI) December 27, 2021