Operation Kagar | ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్రం ఉద్ధృతంగా సాగిస్తున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 200 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్లు తరచూ జరుగుతున్నాయి.
జనవరి 4: అబూజ్‌మఢ్, జంగ్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు.
జనవరి 9 : సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోల ఎన్కౌంటర్
జనవరి 12 : బీజాపూర్, మెహ్దాలో ఐదుగురు మావోల మృతి
జనవరి 16 : ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో పూజారి గ్రామం సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ నేత దామోదర్ కూడా ఉన్నారు.
జనవరి 19 : ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో అగ్ర నేత రామచంద్ర రెడ్డి సహా 14 మంది మరణించారు.
జనవరి 21: గరియాబంద్‌లో 14మంది మావోయిస్టుల ఎన్కౌంటర్. వీరిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు జైరామ్ (చలపతి)ఉన్నారు.
ఫిబ్రవరి 2 : బీజాపూర్, గంగలూరులో 8 మంది నక్సల్స్ ఎన్కౌంటర్
ఫిబ్రవరి 9 : మెహ్దా-ఫార్సెగఢ్ సరిహద్దులో 31 మంది మావోయిస్టులు మృతి
మార్చి 20 : బీజాపూర్‌లో 26 మంది, కాంకేర్‌లో నలుగురు మావోల మృతి
మార్చి 25 : దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో ముగ్గురు మావోల మృతి.
మార్చి 29: సుక్మా-దంతెవాడ సరిహద్దుల్లో 11మంది మహిళలు సహా 16 మంది మృతి. వీరిలో సీనియర్ మావోయిస్టు నేత కుధమి జగదీశ్ ఉన్నారు.
మార్చి 31 : దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ మహిళా మావోయిస్టు కమాండర్ మృతి. ఆమెపై రూ.45 లక్షల రివార్డు
ఏప్రిల్ 21: జార్ఖండ్‌లోని బొకారోలో 8 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో వివేక్‌పై కోటి రివార్డు
ఏప్రిల్ 25: బీజాపూర్ అడవుల్లో ఐదుగురు మావోల ఎన్కౌంటర్
మే 12: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో 31 మంది మావోయిస్టుల మృతి