న్యూఢిల్లీ : దేశంలో బహిరంగ, ప్రైవేట్ ప్రదేశాలలో మహిళల హక్కుల పరిరక్షణకు చట్టపరమైన నిబంధనల కొరత ఏమీ లేనప్పటికీ, చట్టం ఒక్కటే న్యాయమైన వ్యవస్థను ఏర్పాటు చేయలేదని, సమాజం కూడా పితృస్వామ్య సామాజిక వైఖరిని విడనాడాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. సోమవారం ఆయన ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన స్త్రీ శక్తి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంచి, కఠిన చట్టాలు మాత్రమే మహిళలకు పూర్తి ప్రయోజనాన్ని చేకూర్చలేవని, వీటన్నింటికీ అతీతంగా ముందు మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని అన్నారు. మహిళల హక్కుల గురించి మాట్లాడటమంటే అది మహిళలకు సంబంధించినది కాదని అన్నారు. తాను అద్భుతమైన పాఠాలను, మహిళా సహచరుల నుంచి నేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఉన్నతమైన సమాజం కావాలంటే మహిళలకు సమాన ప్రాతినిధ్యం కావాలని తాను నమ్ముతానని అన్నారు. తాము భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ముందే మహిళల జీవిత శాసనాన్ని స్త్రీవాది అయిన హన్సా మెహతా రూపొందించారని చంద్రచూడ్ అన్నారు.
ముంబై, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రిజర్వేషన్లను రద్దు చేస్తామని మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నాలుక కోసిన వ్యక్తికి రూ.11 లక్షల బహుమతి ఇస్తానని మహారాష్ట్రలోని బుల్దానా శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలతో రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి బట్టబయలైందని మండిపడ్డారు. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో రాహు ల్ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైఖరితో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ప్రచారం చేసి ఓట్లు దండుకున్న రాహుల్, ఇప్పుడు అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పడం సరికాదన్నారు.