చెన్నై, ఏప్రిల్ 5: దేశంలో ఏర్పాటైన ట్రిబ్యునళ్లలో రిటైర్డ్ జడ్జీలు లేదా న్యాయవాదులను మాత్రమే జ్యుడీషియల్ సభ్యులుగా నియమించేందుకు అవకాశం ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ఓ వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను అనుమతిస్తూ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.