న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మహిళల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉందని, 5వ దశ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 12 శాతమేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ పేర్కొన్నది. ఏడీఆర్ నివేదిక ప్రకారం 5వ దశ ఎన్నికల్లో మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో మహిళల సంఖ్య 82 మాత్రమే. మొత్తం అభ్యర్థుల్లో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్న అభ్యర్థులు 29 శాతం మంది ఉన్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేష ప్రసంగాలు.. మొదలైన సీరియస్ క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు 18 శాతం మంది ఉన్నారు. కోర్టుల్లో దోషులుగా తేలిన ముగ్గురు అభ్యర్థులు కూడా ఎన్నికల్లో నిలబడటం గమనార్హం.