ఉల్లిగడ్డ 100 నుంచి 150 గ్రాముల బరువు ఉంటుంది. కానీ మహారాష్ట్రలో ఓ రైతు పండించిన ఉల్లిగడ్డ 750 గ్రాముల బరువు ఉన్నది.
ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా ఉల్లిగడ్డలు ఇంతే బరువు ఉండటంతో రైతు ముఖంలో పట్టలేనంత ఆనందం కనిపించింది. ఎలాంటి ప్రత్యేక ఎరువులను వాడకుండానే ఇలా దిగుబడి వచ్చిందని రైతు చెప్పారు.