Onion Prices : సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో గత రెండు వారాలుగా ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాలు లేకపోవడంతో ఉల్లి ధరలు ఇటీవల ఏకంగా 50 శాతం పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అతిపెద్ద ఉల్లి మార్కెట్ నాసిక్‌లో సోమవారం కిలో ఉల్లి ధర రూ. 17 నుంచి రూ.26కు పెరిగింది. నాణ్యతతో కూడిన ఉల్లి ధర కిలో దేశవ్యాప్తంగా పలు హోల్‌సేల్ మార్కెట్లలో రూ. ౩౦ పలుకుతోంది. 2023-24 రబీ దిగుబడులు తగ్గాయనే అంచనాతో ధరలు పెరిగే అవకాశం ఉంటుందనే యోచనతో రైతులు ఉల్లి నిల్వలను బయటకుతీయకపోవడం కూడా సరఫరాలపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
మహారాష్ట్ర ఉల్లికి దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీ డిమాండ్ ఉందని నాసిక్‌కు చెందిన ఉల్లి వ్యాపారి వికాస్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తొలగిస్తుందని రైతులు, స్టాకిస్ట్‌లు ఆశాభావంతో ఉన్నారని, ధరలు పెరుగుతాయనే అంచనాతో రైతులు, వ్యాపారులు ఉల్లిని పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారని, అందుకే ఉల్లి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయని సింగ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండగా వినియోగదారులు మాత్రం ఉల్లి ధరలను తలుచుకుని కలవరపడుతున్నారు.
Read More :
Pawan Kalyan | జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్..