ఇంఫాల్ జూలై 8: మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇంఫాల్‌లో శుక్రవారం రాత్రి 200 మంది గుంపు రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. అనంతరం అక్కడ ఉన్న పోలీసుల తుపాకులను లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అలాగే రాష్ట్రంలో కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో దాదాపు రెండు నెలలుగా ఇంటర్నెట్పై నిషేధం విధించారని, దీన్ని పాక్షికంగా సడలించాలని మణిపూర్ హైకోర్టు ఆదేశించింది.