న్యూఢిల్లీ, అక్టోబర్ 11: భారతీ గ్రూప్ ఆధ్వర్యంలోని ‘వన్‌వెబ్’ సంస్థ తమ ఉపగ్రహ ప్రయోగాల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నది. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్టు వన్‌వెబ్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపింది.