గోరఖ్‌పూర్, జూన్ 15: ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో రాప్తీ నదిలో ఓ పడవ బోల్తాపడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పడవలోని మిగతా 13 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని పోలీసులు చెప్పారు.
గోరఖ్‌పూర్‌లోని నెట్వార్పట్టీ గ్రామం నుంచి ధనయ గ్రామానికి 14 మందితో బయల్దేరిన పడవ ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.