బెంగళూరు: ఊరేగింపు సందర్భంగా 120 అడుగుల ఎత్తైన రథం కూలింది. (Chariot Collapses) ఈ సంఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అనేకల్‌లోని హుస్కూర్‌లో శనివారం మద్దురమ్మ జాతర జరిగింది. ఈ సందర్భంగా వంద అడుగులకుపైగా ఎత్తైన రెండు రథాలను ఆలయ నిర్వాహకులు తయారు చేయించారు.
కాగా, ఊరేగింపు సందర్భంగా రెండు రథాలను తాళ్ల సహాయంతో భక్తులు లాగారు. అయితే ఈదురు గాలుల వల్ల120 అడుగుల ఎత్తైన రథం అదుపుతప్పి ఒక పక్కకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. పలువులు గాయపడ్డారు. పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.
మరోవైపు పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. మృతుడ్ని తమిళనాడులోని హోసూర్‌కు చెందిన లోహిత్‌గా గుర్తించారు. ఎత్తైన రథం కూలిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
😨 100ft Chariot COLLAPSES During Bengaluru Festival, One Killed
Two others were injured during the incident at the historic Madduramma Temple festival near Bengaluru on 22 March.
📹 @Madrassan_Pinky pic.twitter.com/X86PkWgPtA
— RT_India (@RT_India_news) March 23, 2025