శివకాశి పటాకుల కర్మాగారంలో పేలుడు.. ఒకరు మృతి
శివకాశి పటాకుల కర్మాగారంలో పేలుడు | తమిళనాడులోని శివకాశి శివారులోని జమీన్‌సల్వార్‌పట్టి పటాకుల కర్మాగారంలో శనివారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మృతదేహం ఎగిరి సమీపంలో ఉన్న చెట్టుపై పడింది.

చెన్నై : తమిళనాడులోని శివకాశి శివారులోని జమీన్‌సల్వార్‌పట్టి పటాకుల కర్మాగారంలో శనివారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మృతదేహం ఎగిరి సమీపంలో ఉన్న చెట్టుపై పడింది. విరుదునగర్ జిల్లాల్లో ఉన్న శివకాశి ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచ కర్మాగారాలున్నాయి. కరోనా లాక్డౌన్ సడలింపులు ప్రకటించిన నెల తర్వాత ఫ్యాక్టరీలో పటాకుల తయారీ పనులు కొనసాగుతున్నాయి. శనివారం ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలోని మిక్సింగ్ ఛాంబర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించి, మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.
పేలుడు ధాటికి చాంబర్లో ఉన్న కార్మికుడు మృతి చెందగా.. మృతదేహం ఎగిరి చెట్టుపడింది. ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకుదించారు. పేలుడు సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని, కారణాలు ఆరా తీశారు. దీపావళి పండుగకు కొద్ది నెలలే సమయం ఉన్నందున కర్మాగారాల్లో బాంబుల తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలల్లో ఫ్యాక్టరీల్లో పేలుడు సంభవించి 40 మందికిపైగా మరణించారు. ఫిబ్రవరిలో అచ్చంకుళంలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి
Rashad hussain । అంబాసిడర్‌గా భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్
Covid Vaccine for kids । పిల్లలపై టీకా ట్రయల్స్‌కు బయోలాజికల్-ఈకి అనుమతి నిరాకరణ
పని చేసిన బ్యాంక్‌కే కన్నం.. అడ్డువచ్చినందుకు అసిస్టెంట్ మేనేజర్ హత్య!
Covid-19 । దేశంలో కొత్తగా 41,649 కరోనా కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

