Rashad Hussain। అంబాసిడర్‌గా భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్
భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్ | మెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్‌ను అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంబాసిడర్‌గా నామినేషన్ చేశారు. ఈ పదవికి ఎంపికైన తొలి ముస్లింగా రషద్ నిలిచారు. రష్యాద్ హుస్సేన్ జాతీయ భద్రతా మండలిలో భాగస్వామి, అలాగే గ్లోబల్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్‌ను అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంబాసిడర్‌గా నామినేషన్ చేశారు. ఈ పదవికి ఎంపికైన తొలి ముస్లింగా రషద్ నిలిచారు. రషద్ హుస్సేన్ జాతీయ భద్రతా మండలిలో భాగస్వామి, అలాగే గ్లోబల్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్. ఆయన గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నేషనల్ సెక్యూరిటీ డివిజన్లో సీనియర్ కౌన్సెల్‌గా పనిచేశారని వైట్ హౌస్ ప్రకటనలో పేర్కొంది. ఒబామా హయాంలో స్ట్రాటజిక్ కౌంటర్ టెర్రరిజం కమ్యూనికేషన్స్, డిప్యూటీ అసోసియేట్ వైట్ హౌస్ కౌన్సిల్ కోసం ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC) కు అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా రషద్ సేవలందించారు.
రాయబారిగా.. హుస్సేన్ విద్య, వ్యవస్థాపకత, ఆరోగ్యం, అంతర్జాతీయ భద్రత, సైన్స్, టెక్నాలజీ, ఇతర రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడానికి ఇస్లామిక్ సహకారం (OIC), ఐక్యరాజ్యసమితి, విదేశీ ప్రభుత్వాలు, పౌర సమాజ సంస్థల్లోనూ పని చేశారు. ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో చేరడానికి ముందు ఆరో సర్క్యూట్ యూఎస్ అప్పీల్స్ డామన్ కీత్‌కు జ్యుడీషియల్ లా క్లర్క్‌గా పనిచేశాడు. ఒబామా-బిడెన్ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ కౌన్సెల్‌గా కూడా ఉన్నారు. హుస్సేన్ యేల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరబిక్, ఇస్లామిక్ అధ్యయనాలు చేసి మాస్టర్స్ డిగ్రీని పొందారు. రషద్ నియామకంపై అమెరికన్ యూదు కమిటీ (AJC) యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్‌గా నియమించినందుకు బిడెన్ పరిపాలనను ప్రశంసించింది.
ఇవి కూడా చదవండి
హెచ్-1బీ ఆశావహులకు మరో చాన్స్
ఐఎస్ఎస్లో స్టార్‌వార్స్!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

