రెండోసారి లాటరీ తీయనున్న యూఎస్సీఐఎస్
వాషింగ్టన్, జూలై 30: హెచ్-1బీ వీసా ఎంపికలో అవకాశం దక్కనివారికి మరో అవకాశాన్ని అమెరికా కల్పించింది. ఈ ఏడాది రెండోసారి లాటరీ తీయనున్నట్టు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గురువారం వెల్లడించింది. ఈ ఏడాది మొదట్లో డ్రాలో కాంగ్రెషనల్ మ్యాండేట్ నిబంధనల ప్రకారం సరిపడినన్ని వీసాలు జారీచేయని కారణంగా మరోసారి లాటరీ తీయాలని నిర్ణయించినట్టు పేర్కొంది.