ఐఎస్ఎస్లో స్టార్‌వార్స్!

- రష్యా స్పేస్ మాడ్యూల్ నావుకాలో అనూహ్యంగా ఆన్ అయిన ఇంజిన్
- ఒక వైపునకు కదిలిన స్పేస్ స్టేషన్
- ఆవలి వైపు మాడ్యూల్తో ఒత్తిపట్టిన నాసా
- స్పేస్ స్టేషన్ కదలిపోకుండా జాగ్రత్త
మాస్కో, జూలై 30: భూ ఉపరితలానికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఐఎస్ఎస్)లో గురువారం స్టార్ వార్స్ సినిమా కనిపించింది. రష్యా స్పేస్ మాడ్యూల్ ‘నావుకా’ ఇంజిన్ ఒక్కసారిగా మండింది. జెట్ థ్రస్టర్ల ఒత్తిడికి ఐఎస్ఎస్ అదుపు తప్పింది. ఉన్న కక్ష్య నుంచి ఒక వైపునకు కదలిపోయింది. దాదాపు 15 నిమిషాల తర్వాత నాసా గుర్తించింది. వెంటనే ఐఎస్ఎస్ ఆవలి వైపు పార్క్ చేసి ఉన్న మరో మాడ్యూల్ ఇంజిన్‌ను ఆన్ చేసింది. నావుకాకు వ్యతిరేక దిశలో స్పేస్ స్టేషన్‌పై ఒత్తిడి పెంచింది. తద్వారా ఐఎస్ఎస్ కక్ష్య నుంచి కదలకుండా చేసింది. 45 నిమిషాల తర్వాత నావుకా ఇంజిన్లు మండటం ఆగింది. ఈ 30 నిమిషాలు అంతరిక్షంలో రెండు మాడ్యూల్స్ మధ్య ‘టగ్ ఆఫ్ వార్’ నడిచింది. తర్వాత నాసా ఐఎస్ఎస్ను పూర్వ స్థితికి తీసుకువచ్చింది.
మాడ్యూల్లో ఏడుగురు వ్యోమగాములు
ప్రమాదం సమయంలో మాడ్యూల్లో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు. ముగ్గురు నాసాకు చెందినవారు, ఇద్దరు రష్యా వ్యోమగాములు కాగా, జపాన్, ఫ్రాన్స్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ప్రమాదం సమయంలో వీరికి, నాసా శాస్త్రవేత్తలకు మధ్య కమ్యూనికేషన్ రెండుసార్లు తెగిపోయింది. వ్యోమగాములకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని నాసా వెల్లడించింది. ఐఎస్ఎస్కు కూడా ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే వారు అక్కడ నుంచి రావడానికి స్పేస్ స్టేషన్లోనే స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ పార్క్ చేసి ఉన్నదని, ఇది లైఫ్ బోట్ లాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నది.
ముందే అనుమానం
రష్యా గతవారం నావుకాను అంతరిక్షంలోకి పంపింది. అది గురువారమే ఐఎస్ఎస్ను చేరింది. ఐఎస్ఎస్ను చేరిన మూడు గంటల్లోనే ఈ ప్రమాదం సంభవించింది. నావుకాను అంతరిక్షంలోకి ప్రయోగించే ముందే పలు సమస్యలు తలెత్తాయి. ఐఎస్ఎస్కు చేరాక సరిగ్గా పార్క్ అవుతుందా.. లేదా.. అని శాస్త్రవేత్తలు ముందే అనుమానించారు. అనుమానించినట్టే ప్రమాదం జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- NASA
- Russia Space Station
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

