పని చేసిన బ్యాంక్‌కే కన్నం.. అడ్డువచ్చినందుకు అసిస్టెంట్ మేనేజర్ హత్య!
పని చేసిన బ్యాంక్‌కే కన్నం.. | తాను పని చేసిన బ్యాంకుకే కన్నం వేశాడు ఓ మాజీ బ్యాంకు మేనేజర్.. పైగా దోపిడీని అడ్డుకునేందుకు యత్నించిన మహిళా అసిస్టెంట్ మేనేజర్‌ను

ముంబై : తాను పని చేసిన బ్యాంకుకే కన్నం వేశాడు ఓ మాజీ బ్యాంకు మేనేజర్.. పైగా దోపిడీని అడ్డుకునేందుకు యత్నించిన మహిళా అసిస్టెంట్ మేనేజర్‌ను హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ దూబే అనే వ్యక్తి గురువారం రాత్రి 8-9 గంటల మధ్య తన మిత్రుడితో కలిసి బ్యాంకులోకి వెళ్లాడు. బ్యాంకు పని వేళలు ముగియగా బ్యాంకు షట్టర్లు మూసివేసి.. ఇద్దరు మహిళా ఉద్యోగులు లోపల పని చేసుకుంటున్నారు.
నిందితులిద్దరూ అసిస్టెంట్ మేనేజర్ యోగితా వర్థక్, క్యాషియర్ శ్రద్ధా దేవరూఖ్కర్ను కత్తితో బెదిరించి బ్యాంకులో ఉన్న నగదు, ఆభరణాలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత పారిపోయేందుకు యత్నిస్తుండగా.. యోగితా, శ్రద్ధ కేకలు వేశారు. దీంతో నిందితుడు వారిపై కత్తితో దాడి చేసి అక్కడి పారిపోయాడు. ఈ క్రమంలో వీరి కేకలు విన్న పలువురు స్థానికులు.. పారిపోతున్న ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అనిల్ దూబే వారికి చిక్కగా పోలీసులకు అప్పగించారు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యోగిత, శ్రద్ధను ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే యోగిత చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రద్ధా చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితుడు అనిల్ దూబే నైగావ్‌లోని యాక్సిస్ బ్యాంక్ మేనేజర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఘటన తర్వాత బ్యాంకు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి, అంతర్గత దర్యాప్తు ప్రారంభించింది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
హెచ్-1బీ ఆశావహులకు మరో చాన్స్
ఐఎస్ఎస్లో స్టార్‌వార్స్!
Biden Nominates । అంబాసిడర్‌గా భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్
Covid Vaccine for kids । పిల్లలపై టీకా ట్రయల్స్‌కు బయోలాజికల్-ఈకి అనుమతి నిరాకరణ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

