తిరువణ్ణామలై : తమిళనాడులోని జవ్వాడు కొండల దగ్గర గల శివాలయం పునరుద్ధరణ పనుల్లో వందకు పైగా పురాతన బంగారు నాణేలను కనుగొన్నట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు. సోమవారం గర్భగుడి పునరుద్ధరణ జరుగుతుండగా మట్టి కుండలో ఇవి లభించాయని తెలిపారు.
కొన్ని శతాబ్దాల క్రితం చోళ రాజు రాజరాజ చోళన్-3 ఈ గుడిని నిర్మించి ఉండొచ్చని నమ్ముతున్నట్టు పోలూర్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.