సుల్తాన్పూర్: యూపీలోని సుల్తాన్పూర్లో భూ వివాదంలో ఒక డాక్టర్ను కొట్టి చంపడం తీవ్ర కలకలం సృష్టించింది. ఘన్శ్యామ్ తివారీ (53) అనే డాక్టర్ను బీజేపీ నేత ఆధ్వర్యంలో కొందరు కొట్టి చంపారు. బీజేపీ నాయకుని నేతృత్వంలో జరిగిన ఈ మూక హత్యపై యూపీలోని యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నిందితుడిపై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులున్నాయని, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసినట్టు సుల్తాన్పూర్ ఎస్పీ సోమెన్ బర్మ తెలిపారు. ఇదిలా వుండగా యూపీ ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. యూపీలో డాక్టర్ హత్యతో కలకలం