Badlapur Incident : మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్లో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి, ఉత్తర ముంబై బీజేపీ ఎంపీ పీయూష్ గోయల్ గురువారం స్పందించారు. దర్యాప్తు సత్వరమే పూర్తిచేసి నిందితుడిని వీలైనంత త్వరలో కఠినంగా శిక్షించాలని మంత్రి పేర్కొన్నారు.
ఇలాంటి నేరాలకు పాల్పడే వారిలో భయం కలిగేలా నిందితుడికి శిక్ష విధించాలని అన్నారు. ఈ ఘటనను మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడిపై విచారణ చేపట్టి అతడిని సత్వరమే కఠినంగా శిక్షిస్తారని తాను ఆశిస్తున్నానని మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
కాగా, బద్లాపూర్ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరుగుతోందని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర మహారాష్ట్ర సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడిని కొద్దిగంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారని, కానీ బద్లాపూర్ ఘటనలో రోజులు గడిచినా ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు.
Read More :
PM Modi: భారత విదేశీ విధానం మారింది.. పోలాండ్‌లో ప్రధాని మోదీ