ఇంఫాల్: జాతుల ఘర్షణతో రగులుతున్న మణిపూర్లో (Manipur) శనివారం నుంచి ఫ్రీ మూమెంట్ అమలులోకి వచ్చింది. అయితే తమకు ప్రత్యేక పరిపాలన నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేశారు. కాంగ్పోక్పి జిల్లాలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడిపిన రవాణా బస్సులను నిరసకారులు అడ్డుకున్నారు. వాహనాలపైకి రాళ్ళు రువ్వారు. పలు చోట్ల రోడ్లను బ్లాక్ చేసేందుకు ప్రయత్నించారు. గో బ్యాక్ అని నినాదాలు చేశారు.
కాగా, కుకీ నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ఘర్షణలు జరిగాయి. పలు చోట్ల భద్రతా సిబ్బంది లాఠీచార్జ్ చేశారు. ఈ సంఘటనల్లో కొందరు కుకీ మహిళలు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు మణిపూర్లో ఏడాదిన్నరపైగా మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగాయి. వందలాది మంది మరణించారు. ఇళ్లు కోల్పోయిన వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కోసం భద్రతా దళాల రక్షణలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరిలో సీఎం ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో మణిపూర్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.
On International Women’s Day, Kuki women faced brutal violence at Gamgiphai, Kangpokpi District. Male security forces mercilessly assaulted peaceful protesters while women forces stood by.
Peace can never be achieved by Force. #StopViolence #Manipur pic.twitter.com/UUPpfNrBJO— Alice Ngaipilhing (@haokip_alice) March 8, 2025