Pre Wedding Party | లక్నో : ప్రీ వెడ్డింగ్ పార్టీ గొడవకు దారి తీసింది. ఓ యువకుడిని ఫైవ్ స్టార్ హోటల్ బిల్డింగ్ టెర్రస్ పైనుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బరేలికి చెందిన ఓ యువకుడు తన పెళ్లి నేపథ్యంలో ఫ్రెండ్స్ అందరికీ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఓ యువకుడు తన తండ్రికి కాల్ చేసి పిలిపించాడు. ఇక అక్కడికి చేరుకున్న పెద్దాయన తన కుమారుడితో గొడవ పడ్డ యువకుడిని చితకబాదాడు. అనంతరం ఫైవ్ స్టార్ హోటల్ బిల్డింగ్ టెర్రస్ పైనుంచి కిందకు తోసేశాడు. మరో యువకుడిని కిందకు తోసేసి ప్రయత్నం చేశాడు. కానీ ఓ వ్యక్తి అడ్డుకున్నారు. బాధిత వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.