Kanpur | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న ఓ యువకుడు స్కూటీపై అతివేగంగా వెళ్తూ.. ఆటో (auto)ను క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. 12వ తరగతి చదువుతున్న అర్జున్ (17) తన స్నేహితుడితో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ రాత్రి బసచేశారు. మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో అతడి స్నేహితుడు అర్జున్‌కి స్కూటీ ఇచ్చి ఏదో పని నిమిత్తం బయటకు పంపాడు. పని ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో.. ఆటోను ఓవర్‌టెక్ చేయబోయి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు.
కింద పడిపోతున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో ఆటో చక్రాలకు అర్జున్ తల తగిలింది. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం గురించి అర్జున్ స్నేహితుడికి సమాచారం అందించిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
अभिभावकों से हाथ जोड़कर निवेदन है कि वह अपने बच्चों को बिना हेलमेट दो पहिया वाहन चलाने की इजाजत न दे. जरा सी लापरवाही जान पर भारी पड़ सकती है. रायपुर में टेंपो को ओवरटेक करने के चक्कर में 12वीं के छात्र का सिर ऑटो से लड़ गया और मौके पर उसकी मौत हो गई.@kanpurtraffic #Kanpur pic.twitter.com/si9baPmKNZ
— Shyam Tiwari (@Shyamtiwariknp) December 7, 2023
Also Read..
Chiranjeevi | కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
Mamata Banerjee | సల్మాన్ ఖాన్‌తో కలిసి స్టేజ్‌పై చిందేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Michaung Cyclone: ఏపీ, తమిళనాడుకు రెండో ఇన్స్టాల్మెంట్ నిధులు రిలీజ్: అమిత్ షా