దేశంలో ఒమిక్రాన్ కేసులు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో అధిక భాగం మహారాష్ట్రలోనే వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఇక్కడ తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈమేరకు సోమవారం నాడు ఒక ప్రకటన చేశారు. తాజా కేసులతో మహారాష్ట్రలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది.
పూణేలో ఒక కేసు, లాటూర్లో మరొక కేసు వెలుగు చూసినట్లు అధికారులు తెలియజేశారు. ‘మహారాష్ట్రలో కొత్తగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒకటి పూణేలో, మరొకటి లాటూర్లో వెలుగు చూశాయి. ఈ కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది’ అని ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది.