న్యూఢిల్లీ, నవంబర్ 22: పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకు గానూ 500 మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించాలని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. సంస్థ ఖర్చులను తగ్గించి, నిర్వాహక సామర్థ్యం పెంచేందుకు ఓలా ప్ర యత్నిస్తుంది. దీంతో అన్ని విభాగా ల నుంచి 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ విషయం పై ఓలా ఇంకా స్పందించలేదు. విద్యుత్తు ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ప్రస్తుతం నష్టాలను చవిచూస్తున్నది.