పారదీప్ : పాకిస్థాన్‌కు చెందిన 21 మంది నావికా సిబ్బంది ఉన్న ఒక నౌక ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు చేరుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై పారదీప్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ కొరియా నుంచి వయా సింగపూర్ మీదుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు క్రూడ్ అయిల్ను తీసుకువచ్చిన ‘ఎంటీ సైరన్ 2’ వాణిజ్య నౌకలో మొత్తం 25 మంది నావికా సిబ్బంది ఉండగా, అందులో 21 మంది పాకిస్థానీయులు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
క్రూడాయిల్‌ను అన్లోడ్ చేసే వరకు సిబ్బంది ఎవరూ నౌకను వదిలి వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ గస్తీ తిరుగుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.