Oil Price | త్వరలోనే పండగల సీజన్ మొదలుకానున్నది. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతునన్నది. ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిపై సుంకం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా వంటనూనెల ధరలు పెరగనున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారుల ఒత్తిడి నేపథ్యంలో ఈ కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు మధ్యప్రదేశ్ వ్యాపారుల ఒత్తిడితో శనగలపై స్టాక్ పరిమితి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సంకాన్ని పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సూచించింది. దేశీయ నూనె గింజల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే దీనికి కారణమని మంత్రిత్వశాఖ పేర్కొంది. సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SOPA) చైర్మన్ డేవిశ్ ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో ఆయన సమావేశమయ్యారు.
దిగుమతి చేసుకునే నూనెలపై సుంకాన్ని పెంచాలని సోపా చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నది. దీంతో రైతులు తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (MSP) పొందేందుకు వీలు ఉంటుంది. దేశీయ ఆయిల్ పరిశ్రమ నుంచి ఒత్తిడి సైతం తొలగిపోతుందని సోపా పేర్కొంటుంది. ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5.5 శాతం దిగుమతి సుంకం వర్తిస్తుంది. ఇందులో సెస్ సైతం ఉంటుంది. అదేవిధంగా రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్‌పై 13.75 శాతం కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లో సోయాబీన్ ధర పడిపోవడంతో సోయాబీన్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కస్టమ్స్ సుంకాన్ని పెంచనంత వరకు నూనెగింజల ఉత్పత్తిని పెంచేలా రైతులను ప్రోత్సహించడం భావిస్తున్నారు. గతంలో రాష్ట్ర వ్యాపారుల డిమాండ్ వరకు శనగలపై స్టాక్ పరిమితిని తొలగించడం గమనార్హం. మరో వైపు కేంద్ర ప్రభుత్వం రూ.6800కోట్లతో త్వరలోనే జాతీయ నూనెగింజల మిషన్‌ను ప్రకటించనున్నది. అలాంటి పరిస్థితిలో స్థానిక ఉత్పత్తులకు మంచి ధర కోసం ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచే అవకాశాలున్నాయి.