లక్నో: యూపీలో కొందరు ప్రభుత్వ అధికారులు బీజేపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, వారిని విధుల నుంచి తప్పించాలని కోరుతూ ఈసీకి ఎస్పీ లేఖ రాసింది. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నవ్నీత్ సెంఘాల్, యూపీ ఏడీజీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్, పలువురు ఏటీఎస్ అధికారులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.