మేడిపల్లి, ఫిబ్రవరి 7: ప్రియురాలితో వీడియో కాల్లో మాట్లాడుతూ ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోడుప్పల్ అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో నివాసముంటున్న ఓ ప్రైవేటు ఉద్యోగి సత్యనారాయణ కొడుకు అభినవ్(17)ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో డిజిల్ ఇంజినీర్‌గా రెండో సంవత్సరం చదువుతూ మేడిపల్లిలో ఓ క్లాత్ షాపింగ్‌మాల్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. ఈనెల 5న రాత్రి తల్లి దండ్రులు సోదరి పుట్టినరోజు కోసం షాపింగ్‌కు ఉప్పల్ వెళ్లారు. అదే సమయంలో ప్రేమించిన అమ్మాయికి వీడియో కాల్ చేసి ఇంట్లో చున్నీతో ఉరేసుకున్నాడు. వెంటనే అమ్మాయి అతడి స్నేహితులకు సమాచారం అందించగా.. వారు వెంటనే అభినవ్ ఇంటికి వెళ్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
యూట్యూబ్‌లో ప్రచారం బాధాకరం..
చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి, ఆమె కొడుకు, కూతురు కేసులో కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్‌లో తప్పుడు ప్రసారం చేస్తున్నారని విజయారెడ్డి సోదరుడు చిరంజీవి శనివారం ఫిర్యాదు చేసేందుకు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయనను కోర్టుకు వెళ్లాలని పోలీసులు సలహా ఇచ్చారు. తన చెల్లెలు, అల్లుడు, కోడలు చ నిపోయారని, తాము ఆవేదనలో ఉంటే అసత్యపు ప్రసారాలు చేస్తున్నారని ఆవేద న వ్యక్తం చేశారు.వారి మరణంపై ఏం అనుమానాలు లేవన్నారు. మాపై అసత్యపు ప్రసారాలు చేస్తున్న ఛానల్స్‌పై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తామన్నారు.