న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్(Deepfakes) వీడియోలపై కేంద్రం సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ అంశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. డీప్‌ఫేక్ కాంటెంట్ విషయంలో చర్యలు తీసుకునేందుకు ఆ ఆఫీసర్‌ను నియమించనున్నట్లు ఆయన చెప్పారు. సోషల్ మీడియా కంపెనీలతో జరిగిన సమావేశం తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తున్న వారిపై జరిమానాలు విధిస్తామని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. తప్పుడు సమాచార వ్యాప్తిని నియంత్రించడం కంపెనీల బాధ్యతే అని, అలాంటి కాంటెంట్ ఉంటే వాటిని 36 గంటల్లోనే తొలగించాలని, ఐటీ రూల్స్ 2021 ప్రకారం చర్యలు ఉంటాయని మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. డీప్‌ఫేక్‌లను క్రియేట్ చేసి, సర్య్యూలేట్ చేసేవారికి లక్ష జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధించనున్నట్లు కేంద్రం పేర్కొన్నది.