Jagannath Temple | ఫిబ్రవరి 1 నుంచి భక్తులకు పూరీ జగన్నాథుడి దర్శనం
Jagannath Temple | ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పూరీ జగన్నాథుడి దేవాలయంలో (Jagannath Temple) భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు భారీగా వెలుగు చూసిన నేపథ్యంలో

భువనేశ్వర్ : ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పూరీ జగన్నాథుడి దేవాలయంలో (Jagannath Temple) భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు భారీగా వెలుగు చూసిన నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 31 వరకు ఆలయాన్ని మూసివేశారు. భక్తులకు దర్శనాలను మాత్రం నిలిపివేసిన అధికారులు, ఆలయంలో సంప్రదాయం ప్రకారం అంతరాయం లేకుండా పూజాధికాలు నిర్వహించారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ఆలయాన్ని తిరిగి తెరవాలని నిర్ణయించినట్లు కలెక్టర్ సమర్థ్ వర్మ పేర్కొన్నారు.
ఆలయాన్ని శానిటైజ్ చేసేందుకు ప్రతి ఆదివారం మూసివేస్తామని, భక్తులకు ఎలాంటి దర్శనాలుండవన్నారు. స్థానికులకు పడమర ద్వారం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తూర్పు ద్వారం నుంచి ప్రవేశం కల్పించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పండుగ రోజుల్లో ఆలయాన్ని మూసివేయనున్నట్లు పూరీ కలెక్టర్ తెలిపారు. త్వరలోనే దర్శనాలకు సంబంధించి విధివిధానాలను విడుదల చేస్తామన్నారు. దర్శన సమయాలు, మందిరంలోకి వచ్చే ముందుకు భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొననున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

