భువనేశ్వర్: ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఫ్లాట్ కిటికి నుంచి నోట్ల వర్షం కురిసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్కు చెందిన చీఫ్ ఇంజినీర్ బైకుంఠనాథ్ సారంగి ఇంటిపై దాడిచేశారు. వారు వస్తున్న విషయం తెలుసుకున్న సారంగి అధికారులకు పట్టుబడకూడదన్న ఉద్దేశంతో భవనేశ్వర్లోని తన ఫ్లాట్ కిటికి నుంచి రూ.500 నోట బండిళ్లను బయటకు విసిరేశాడు.
అలా విసిరేసిన నగదును ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్, అంగుల్, పిలిపి (పూరి) సహా ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు మొత్తం రూ. 2.1 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.