Uttar Pradesh | యూపీలో మరో ఘోరం.. బాలికపై లైంగిక వేధింపులు, ప్రతిఘటించడంతో రైలు కిందకు తోసేసిన దుండగులు
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో 17 ఏండ్ల బాలిక పట్ల కొంతమంది యువకులు అమానుషంగా వ్యవహరించారు. లైంగిక వేధింపుల్ని ప్రతిఘటించిన బాలికను తీసుకెళ్లి ఓ రైలు కింద పడేశారు.
- కాళ్లు, చేయి కోల్పోయిన బాధితురాలు
- గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
Uttar Pradesh | లక్నో, అక్టోబర్ 11: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో 17 ఏండ్ల బాలిక పట్ల కొంతమంది యువకులు అమానుషంగా వ్యవహరించారు. లైంగిక వేధింపుల్ని ప్రతిఘటించిన బాలికను తీసుకెళ్లి ఓ రైలు కింద పడేశారు. దీంతో ఆ అమ్మాయి రెండు కాళ్లు, ఓ చేయి కోల్పోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. బరేలి సిటీలోని జ్సీబీ గం ప్రాంతంలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది.
నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసుల్ని జిల్లాడ్ కలెక్టర్ సస్పెం చేశారు. ఇంటర్ చదువుతున్న తన కూతురిపై ఒక యువకుడు, అతడి స్నేహితులు వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది.
అసలేం జరిగింది?
బాధిత యువతి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా కొంతమంది యువకులు ఆమెను అడ్డుకున్నారు. అసభ్యంగా ప్రవర్తించారు. తీవ్రంగా ప్రతిఘటిస్తుంటే.. అందరూ కలిసి ఆమెను ఓ రైలు ముందు పడేశారు. రైల్వే క్రాసింగ్ వద్ద తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయిందని, ప్రాణాలతో బయటపడుతుందా? అన్నది చెప్పలేమని దవాఖాన వైద్యులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

