Fog in Bhubaneswar: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో దట్టంగా పొగమంచు కమ్ముకున్నది. నగరం అంతటా గట్టిగా పొగమంచు కమ్మేసింది. దాంతో రోడ్లపై విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. కనీసం 10 మీటర్ల దూరంలో ఏమున్నదో కూడా కనబడని పరిస్థితి నెలకొన్నది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శీతాకాలం కావడంతో పగటి ఉష్టోగ్రతలు అంతకంతకే పడిపోతున్నాయి. దాంతో వాతావరణంలో తేమ శాతం పెరుగుతున్నది. వాతావరణంలో తేమకు దుమ్ము రేణువులు, ఉదయం పూట మంచు తోడవడంతో రోడ్లపై విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోతున్నది. దాంతో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతోపాటు భువనేశ్వర్ తదితర నగరాల్లో ఉదయంపూట వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.