భువనేశ్వర్: ఇద్దరు అన్నదమ్ములు టీనేజర్పై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె గర్భవతి అని తెలిసి ఆమెను సజీవంగా పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జగత్సింగ్పూర్ జిల్లా బనష్బరాకు చెందిన అన్నదమ్ములైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు బాలికపై కొంత కాలం పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఇటీవల అయిదు నెలల గర్భవతి అని తెలుసుకుని ఆమెను గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో గోతిలో పాతి పెడతామని బెదిరించారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక తండ్రికి విషయాన్ని చెప్పింది.