భువనేశ్వర్: ఛత్తీస్గఢ్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతిచెందగా.. తాజాగా ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో మరో మావోయిస్టు మరణించాడు. ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. అనంతరం ఘటనా ప్రాంతాన్ని పరిశీలించగా ఒక నక్సల్ కమాండర్ ( Naxal commander ) మృతదేహం లభ్యమైంది.
అంతేగాక, ఘటనా ప్రాంతం నుంచి భారీగా మారణాయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన పుస్తకాలు, రాతప్రతులు, ఎఫ్ఎం రేడియో, దుస్తులు, బ్యాగులు, బూట్లు కూడా ఎన్కౌంటర్ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.