గంజాం: బీజేపీ పాలిత ఒడిశాలో పెండ్లి మండపం నుంచి ఇద్దరు బాలికలను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బ్రహ్మపూర్ ఎస్పీ శ్రావణ్ వివేక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ దారుణం ఈ నెల 3న జరిగింది. విశాఖపట్టణానికి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
బాధితుల్లో ఒకరి వయసు 14 ఏండ్లు, మరొకరి వయసు 15 ఏండ్లు. వారి కుటుంబ సభ్యులు ఈ నెల 4న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నలుగురు నిందితులు బాలికలపై సామూహిక లైంగిక దాడి చేసి, తీవ్రంగా కొట్టి, వదిలిపెట్టారు. బాధితులను ఈ నెల 6న వైద్య పరీక్షల కోసం పంపించారు. బాధితులు, నిందితులు ఒకే గ్రామానికి చెందినవారు.