Kambhampati Hari Babu | ఒడిశా గవర్నర్ (Odisha Governor)గా కంభంపాటి హరిబాబు (Kambhampati Hari Babu) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్ సింగ్ ప్రమాణం చేయించారు. రాజధాని భువనేశ్వర్ (Bhubaneswar)లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్, మాజీ సీఎం నవీన్ పట్నాయక్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
#WATCH | Bhubaneswar | Odisha Governor-designate Hari Babu Kambhampati takes oath as Governor of Odisha.
(Video Source: I&PR) pic.twitter.com/aB953ZID4R
— ANI (@ANI) January 3, 2025
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు 2021 జులైలో తొలిసారి మిజోరం గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ రాజీనామాతో.. ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబును నియమిస్తూ గతేడాది డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా (Ajay Kumar Bhalla).. ఇవాళ మణిపూర్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. బీహార్ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా జనరల్ విజయ్ కుమార్ సింగ్, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది. ఈ మేరకు గత నెల 24న రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
Also Read..
HMPV | చైనాలో మరో మహమ్మారి.. హెచ్ఎంపీవీ లక్షణాలు, నివారణ చర్యలు ఇవే..!
Ajay Kumar Bhalla: మణిపూర్ గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లా ప్రమాణస్వీకారం
Bihar | రైల్వే ట్రాక్‌పై పబ్జీ ఆడుతూ.. ముగ్గురు యువకులు దుర్మరణం