న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా(Ajay Kumar Bhalla).. ఇవాళ మణిపూర్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య స్థానంలో గవర్నర్‌గా భల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. జూలై 2023 నుంచి లక్ష్మణ్ ప్రసాద్.. ఇంచార్జీ గవర్నర్‌గా చేసిన విషయం తెలిసిందే.
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన భల్లాది.. అస్సాం – మేఘాలయా క్యాడర్. ఆగస్టు 2024 వరకు అయిదేళ్ల పాటు ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా చేశారు. వాస్తవానికి భల్లాది పంజాబ్‌లోని జలంధర్. అయితే మణిపూర్ గవర్నర్‌గా ఆయన్ను నియమించడం ఆసక్తిగా మారింది. 2023 మే నుంచి మణిపూర్ వర్గ హింసతో రగిలిపోతున్న విషయం తెలిసిందే.
మణిపూర్ గవర్నర్‌గా భల్లాను నియమిస్తూ డిసెంబర్ 24వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం ఇంఫాల్‌లో భల్లాకు అరుదైన గౌరవం దక్కింది. మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ నేతృత్వంలోని బృందం ఆయనకు స్వాగతం పలికింది.