భువనేశ్వర్, మే 30: వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన వారసుడ్ని రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. తన తరపున అన్ని నిర్ణయాలు పాండియనే తీసుకొంటూ షాడో సీఎంగా ఉన్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘ఇది హస్యాస్పదం. దీనికి ఏమాత్రం ఆధారాలు లేవు’ అని అన్నారు. తమిళనాడుకు చెందిన మాజీ బ్యూరోక్రాట్ వీకే పాండియన్ నవీన్ పట్నాయక్‌కు బీజేడీ పార్టీలో, ప్రభుత్వంలో అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు.