Mamta Mohandas | ఎంగేజ్మెంట్ అయిన విషయం దాచిపెట్టిన హీరో.. డేటింగ్ పేరుతో నన్ను మోసం చేశాడన్న మమతా మోహన్ దాస్
Mamta Mohandas | టాలీవుడ్ ప్రేక్షకులకు యమదొంగ సినిమాతో సుపరిచితురాలైన మమతా మోహన్‌దాస్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
Mamta Mohandas | టాలీవుడ్ ప్రేక్షకులకు యమదొంగ సినిమాతో సుపరిచితురాలైన మమతా మోహన్‌దాస్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా గాయని గా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. మలయాళ చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత తెలుగు–తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. తెలుగులో యమదొంగతో పాటు కృష్ణార్జున, హోమం వంటి చిత్రాల్లో నటించి మంచి ఆదరణ పొందారు. స్వచ్ఛమైన నటన, అందమైన స్క్రీన్ ప్రెజెన్స్, మృదువైన గాత్రం ఈ మూడు కలయిక ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చాయి.అయితే కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే మమత వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యాయి.
2009లో ఆమెకు మొదటిసారి క్యాన్సర్ నిర్ధారణ కావడం సినీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. దీర్ఘకాల చికిత్స అనంతరం కోలుకుని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కానీ 2013లో మరోసారి అదే వ్యాధి తిరగబెట్టింది. అంతేకాదు, ఆమెకు విటిలిగో (బొల్లి) సమస్య కూడా తలెత్తింది. వరుస ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆమె ధైర్యం కోల్పోలేదు. తన అనుభవాలను పంచుకుంటూ క్యాన్సర్ సర్వైవర్‌గా అనేక మందికి ప్రేరణగా నిలిచారు. కొంత విరామం తర్వాత 2023లో విడుదలైన రుద్రాంగి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన రీ-ఎంట్రీని గుర్తుండిపోయేలా చేసుకున్నారు.ఇటీవల ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మమతా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను బహిరంగంగా పంచుకున్నారు.
ముఖ్యంగా ప్రేమ, డేటింగ్ విషయాల్లో ఎదురైన చేదు అనుభవాలు అభిమానులను కదిలించాయి. క్యాన్సర్ నిర్ధారణ తర్వాత జీవితాన్ని మరింత సానుకూలంగా చూడాలని, సాధారణ మహిళలా తన భావోద్వేగాలను అనుభవించాలని భావించానని ఆమె తెలిపారు. మలయాళ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు తనను డేటింగ్‌కు ఆహ్వానించాడని, కుటుంబ సభ్యుల అనుమతితో ఆ పరిచయాన్ని కొనసాగించానని చెప్పారు. అయితే ఆ వ్యక్తికి అప్పటికే మరొకరితో నిశ్చితార్థం జరిగిన విషయం తర్వాత తెలిసిందని వెల్లడించారు. ఈ విషయం తనను తీవ్రంగా కలిచివేసిందని, నమ్మకద్రోహం మానసికంగా కుంగదీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మరో వ్యక్తితో పరిచయం ఏర్పడినా, అతను ప్రేమకంటే తన కెరీర్ ముఖ్యమని చెప్పడంతో ఆ బంధం కూడా ముగిసిపోయిందని తెలిపారు.ఈ అనుభవాలన్నీ తనకు జీవిత పాఠాలు నేర్పాయని, ఇప్పుడు తాను మరింత బలంగా మారానని మమతా చెప్పారు. వ్యాధులతో పోరాడి గెలవడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలోని ఎదురు దెబ్బలను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె ప్రయాణం అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

