Supreme Court | మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దు: సుప్రీంకోర్టు
మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2010 నుంచి 77 సామాజిక వర్గాలకు ఓబీసీ హోదాను కల్పించింది.
- పశ్చిమ బెంగాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
- ముస్లిం వర్గాలకు ఓబీసీ హోదా కల్పించిన ప్రభుత్వం
- ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టేసిన కలకత్తా హైకోర్టు
- హైకోర్టు తీర్పును సవాల్ చేసిన బెంగాల్ ప్రభుత్వం
Supreme Court | న్యూఢిల్లీ: మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2010 నుంచి 77 సామాజిక వర్గాలకు ఓబీసీ హోదాను కల్పించింది. వీటిలో అత్యధికం ముస్లిం మతానికి చెందిన వర్గాలు. ప్రభుత్వ నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. ‘ఈ సామాజిక వర్గాలను ఓబీసీలుగా ప్రకటించడానికి మతం ఒక్కటే ఏకైక ఆధారంగా కనిపిస్తున్నది’ అంటూ హైకోర్టు అప్పుడు వ్యాఖ్యానించింది.
హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. సూత్రప్రాయంగా ముస్లింలు రిజర్వేషన్లకు అర్హులు కాదా అని వ్యాఖ్యానించగా, ‘మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దు’ అని జస్టిస్ గవాయి బదులిచ్చారు.
జనవరి 7కు విచారణ వాయిదా
ఈ రిజర్వేషన్ మతం ఆధారంగా ఇచ్చింది కాదని, వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిందని కపిల్ సిబల్ పేర్కొన్నారు. హిందువులకు సైతం వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఉందని అన్నారు. రంగనాథ్ కమిషన్ కూడా ఈ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించిందని, వీటిలో చాలా వర్గాలు కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు.
హైకోర్టు తీర్పు కారణంగా 12 లక్షల మంది ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యాయని, వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల హక్కులను హైకోర్టు నిర్ణయం ప్రభావితం చేస్తున్నదని, హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. బెంగాల్ ప్రభుత్వం ఎలాంటి సర్వే చేయకుండా, బీసీ కమిషన్ను సంప్రదించకుండా రిజర్వేషన్లు కల్పించిందని ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది పత్వాలియా వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

